రష్మిక ఖాతాలో మరో హిట్ చేరిపోయింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక ఖాతాలో మరో హిట్ చేరిపోయింది

  • తెలుగులో మంచి క్రేజ్
  •  కన్నడలో తాజా హిట్ 
  • తమిళం నుంచి కూడా ఛాన్స్
తెలుగులో 'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలతో యూత్ హృదయాలను దోచేసిన రష్మిక, కన్నడలోను వరుస సినిమాలు చేస్తోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'యజమాన' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ వస్తోంది.

దాంతో రష్మిక ఫుల్ ఖుషీ అవుతోందట. దర్శన్ జోడీగా తాను చేసిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావడం, భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకోవడం పట్ల రష్మిక సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, కన్నడలో రష్మికకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలో తమిళంలోను ఆమె ఒక సినిమాను అంగీకరించే అవకాశాలు వున్నాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. అక్కడ కూడా సక్సెస్ అయితే అమ్మడు అదృష్టవంతురాలి కిందే లెక్క.
rashmika

More Telugu News