సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పెళ్లయ్యాక కూడా నటిస్తుందట 
  • బన్నీ సినిమా స్క్రిప్టుకి మార్పులు 
  • నిర్మాతగా మారిన 'యాత్ర' దర్శకుడు  
 *  'అఖిల్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక సాయేశా సైగల్ తమిళ నటుడు ఆర్యను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో వారంలో హైదరాబాదులో వీరి వివాహ వేడుక జరుగుతుంది. కాగా, వివాహమయ్యాక కూడా నటన కొనసాగిస్తానని, సినిమాలకు స్వస్తి చెప్పే ఉద్దేశం లేదని సాయేశా తాజాగా చెప్పింది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందే చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, స్క్రిప్టుకు ఇంకా మార్పులు చేర్పులు చేస్తున్నందున ఆలస్యమవుతోందని అంటున్నారు. అలాగే కథానాయికను కూడా ఇంకా ఎంపిక చేయలేదు.
*  ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' చిత్రాన్ని రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. తన మిత్రులతో కలసి త్రీ ఆటమన్ లీవ్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పారు.
Go Back to Shorts
Sayesha
Akhil
Allu Arjun
Trivikram

More Telugu News