షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు: సునీల్ అరోరా
- భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం ఎన్నికలపై ఉండదు
- అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాలి
- ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రెండు రోజులుగా అరోరా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. వారిచ్చిన సమాచారాన్ని ఐటీ విభాగం నిర్ధారిస్తుందని, తేడాలుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ కట్టుబడి ఉందన్న అరోరా.. ఉద్వేగ, రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.