అభినందన్ అప్పగింతల్లో కీలకపాత్ర పోషించిన అంతర్జాతీయ రెడ్ క్రాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభినందన్ అప్పగింతల్లో కీలకపాత్ర పోషించిన అంతర్జాతీయ రెడ్ క్రాస్

  • ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం
  • ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల పర్యవేక్షణ
  • అభినందన్ ను భారత్ కు అప్పగింత
ఛారిటీ కార్యక్రమాలకు అంతర్జాతీయంగా పేరుపొందిన రెడ్ క్రాస్ సంస్థ భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకారం తమ కస్టడీ నుంచి విడుదల చేసిన అభినందన్ ను పాక్ తొలుత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు అప్పగించింది. రెడ్ క్రాస్ నేతృత్వంలోనే అభినందన్ ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ పాక్ అధికారులు నిర్వహించిన ఆఖరి దశ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అంతా రెడ్ క్రాస్ ప్రతినిధుల సమక్షంలోనే జరిగింది. అభినందన్ కు వీసా జారీ చేసిన అనంతరం అతడిని రెడ్ క్రాస్ కమిటీ భారత వాయుసేన అధికారులకు అప్పగించింది. శుక్రవారం ఉదయం పాక్ కస్టడీ నుంచి వెలుపలికి వచ్చినప్పటి నుంచి వాఘా సరిహద్దు వద్ద అభినందన్ భారత గడ్డపై కాలుమోపేవరకు రెడ్ క్రాస్ మధ్యవర్తిగా ముఖ్యభూమిక పోషించింది.
India
Pakistan

More Telugu News