చాలామందితో లవ్ ఎఫైర్స్ వుండేవి .. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తారా?: రాయ్ లక్ష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలామందితో లవ్ ఎఫైర్స్ వుండేవి .. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తారా?: రాయ్ లక్ష్మి

  • గ్లామరస్ నాయికగా పేరు
  •  గర్భవతి అంటూ ప్రచారం
  • మండిపడిన రాయ్ లక్ష్మి 
వివిధ భాషల్లో గ్లామరస్ హీరోయిన్ గా రాయ్ లక్ష్మికి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున ప్రధాన పాత్రధారిగా చేయడానికి .. మరో వైపున ఐటమ్ నంబర్లు చేయడానికి కూడా ఆమె సిద్ధమైపోతోంది. అలాంటి రాయ్ లక్ష్మి గర్భవతి అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఆమె తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ .." నాకు చాలామందితో లవ్ ఎఫైర్స్ ఉండేవి .. కొంతమందితో బ్రేకప్ కూడా జరిగిపోయింది. అంతమాత్రాన మీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తారా? పచ్చి మామిడికాయలు తిన్నా గర్భవతిని అంటూ ప్రచారం చేస్తున్నారు. నా గురించి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అంటూ ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. సాధారణంగా రాయ్ లక్ష్మి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోదు. ఇది ఆమె కెరియర్ కి సంబంధించిన విషయం కూడా కావడంతో ఆమెకి అంత కోపాన్ని తెప్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
rai lakshmi

More Telugu News