ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మోదీ.. అత్యవసర సమావేశం నిర్వహణ
- విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ
- మధ్యలో చిన్న కాగితాన్ని అందించిన పీఎంవో అధికారి
- వేదిక దిగి హుటాహుటిన వెళ్లిపోయిన మోదీ
భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడంతో అత్యవసర సమావేశాన్ని మోదీ నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు.