ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరశన దీక్ష వాయిదా

  • భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల దీక్ష వాయిదా
  • ఈ పరిస్థితుల్లో దేశం కోసం అందరూ ఐక్యంగా నిలవాలి
  • భారత వైమానిక దళ పైలట్లకు ‘సెల్యూట్’: కేజ్రీవాల్
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష వాయిదా పడింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే మార్చి1న తాను చేపట్టాల్సిన దీక్షను వాయిదా వేసుకున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో దేశం కోసం అందరూ ఐక్యంగా నిలవాలని అన్నారు. మరో ట్వీట్ లో, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులకు తాము గర్విస్తున్నట్టు చెప్పారు. భారత వైమానిక దళ పైలట్లకు ‘సెల్యూట్’ చేస్తున్నట్టు ప్రకటించారు.


Go Back to Shorts
delhi
cm
Arvind Kejriwal
Pakistan
India

More Telugu News