పాక్ ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ... 300 మంది ఉగ్రవాదుల హతం!
- 200కు పైగా బాంబులు వేసిన యుద్ధ విమానాలు
- 3 కంట్రోల్ యూనిట్లు ధ్వంసం
- ఎల్ఓసీని విమానాలు దాటగానే తరిమేశామన్న పాక్
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రధాన పట్టణాలైన బాలాకోట్, ముజఫరాబాద్ శివార్లలో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారవిడిచిన వాయుసేన విమానాలు, ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేసి వచ్చాయి. దీనిపై స్పందించిన పాకిస్థాన్, భారత యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చాయని, దీన్ని గమనించిన తమ ఫైటల్ జెట్స్ వాటిని తరిమేశాయని ప్రకటించింది.