మహిళ షూలో దూరి విమానంలో 15 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పాము!
- ఆస్ట్రేలియా నుంచి స్కాట్లాండ్ వరకు ప్రయాణించిన పాము
- తొలుత బొమ్మ పాము అని పొరబడిన మహిళ
- బతికి ఉండడంతో ప్రయాణికుల బెంబేలు
ఎవరో ప్రాంక్ కోసం బొమ్మ పామును పెట్టి ఉంటారని భావించింది. అయితే, అది కదలడంతో అక్కడనున్న అందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అధికారులకు సమాచారం అందించడంతో దానిని పట్టుకున్నారు. ఆ పాము విషపూరితం కాదని, కొండచిలువ జాతికి చెందినదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మకాయ్ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించిన ఈ కొండచిలువను సాధారణంగా పెంచుకుంటూ ఉంటారని అధికారులు తెలిపారు.