బ్రేకింగ్... భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్స్... 1000 కిలోల బాంబులతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేసిన సైన్యం!

  • తెల్లవారుజామున 3 గంటలకు దూసుకెళ్లిన విమానాలు
  • వైమానిక దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
  • జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చాయి. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం, సుమారు 1000 కిలోల బాంబులను ఈ విమానాలు జారవిడిచాయి.

వైమానిక దాడులను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కశ్మీర్ లోని వైమానిక స్థావరాల నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు, పీవోకేలోకి దూసుకెళ్లి, బాంబుల వర్షం కురిపించాయి. భారత సైన్యం నిర్వహించిన మరో సర్జికల్ స్ట్రయిక్స్ పై మరిన్ని వివరాలు అందాల్సివుంది.
Go Back to Shorts
India
Pakistan
Surgicle Strikes

More Telugu News