నా మనసుకు మాత్రం కర్నూలే రాజధాని!: పవన్ కల్యాణ్
- కర్నూలును అమరావతిని మించిన నగరంలా తీర్చిదిద్దుతా
- రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తా
- అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్రమంతా పర్యటిస్తే ప్రయోజనం ఏమిటి?
ఓట్లు అడగడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని... సమాజంలో మార్పు కోసమే వచ్చానని పవన్ చెప్పారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ ప్రజాసమస్యలను పట్టించుకోవాలని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్రమంతా పర్యటిస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. యువతలో ప్రశ్నించే ధైర్యం రావాలని చెప్పారు.