సోదరుడి కోసం ప్రియాంక ‘సంకల్ప్'.. 28న గుజరాత్లో భారీ ర్యాలీ
- సోనియా, రాహుల్‌తో కలిసి నిర్వహణ
- ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
- ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రోడ్ షో నిర్వహించిన ఆమె ఈనెల 28వ తేదీన గుజరాత్లో తొలిసారి ‘సంకల్ప్ ర్యాలీ’ నిర్వహించాలని నిర్ణయించారు. తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక ఈ ర్యాలీ నిర్వహించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ర్యాలీతో పునరుజ్జీవం పోయాలని ఆమె భావిస్తున్నారు.
అహ్మదాబాద్‌లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం ఈ ర్యాలీ జరగనుందని, ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడనున్నారని సమాచారం. ప్రియాంక ర్యాలీ నేపథ్యంలో పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.