'సైరా' షూటింగ్ ను అడ్డుకున్న ముస్లింలు.. ఉద్రిక్తత
- బీదర్ కోటలో 'సైరా' షూటింగ్
- హిందూ విగ్రహాలను ఉంచారంటూ ముస్లిం యువకుల ఆందోళన
- కోట చుట్టు పక్కల ఉద్రిక్త వాతావరణం
'సైరా' చిత్రం చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీదర్ కోటలో ఓ పత్యేక సెట్ వేశారు. ఈ సెట్ లో హిందూ విగ్రహాలను ఉంచారు. షూటింగ్ కు పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నా... ముస్లిం యువకులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి హిందూ విగ్రహాలను, సెట్ ను తొలగించినట్టు సమాచారం. ఈ ఘటనతో కోట చుట్టుపక్కల ఉద్రిక్తత నెలకొంది. ముందు జగ్రత్త చర్యగా కోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.