దొంగ పాస్పోర్టులతో కేసీఆర్, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయి: కళా వెంకట్రావు
- కేసీఆర్ కుట్రలు తెలిసిపోయాయి
- ఏపీపై హైదరాబాద్లో కుట్ర
- పోలవరంపై కేసు వేయడానికి జగనే కారణం
దొంగ పాస్పోర్టులతో కేసీఆర్, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయని తన లేఖలో వెంకట్రావు విమర్శించారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై కేసీఆర్ కేసులు వేయడానికి జగన్ సలహాలే కారణమని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే తమ ఆటలు సాగవనే భయం కేసీఆర్, జగన్కు పట్టుకుందని పేర్కొన్నారు.