టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ వెళ్లిన తర్వాత గంటా పరిస్థితి బాగాలేదు: విష్ణుకుమార్ రాజు

  • వచ్చే ఎన్నికల్లో గంటా గెలుస్తారో లేదో కూడా చెప్పలేం
  • సిట్ నివేదికను పూర్తి స్థాయిలో బయటపెట్టాలి
  • ఈ నివేదిక బయటపెడితే ప్రభుత్వం కూలిపోతుంది
టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి బాగాలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా గెలుస్తారో లేదో కూడా చెప్పలేమని జోస్యం చెప్పారు.

తనపై పోటీ చేసేందుకు బలమైన ప్రత్యర్థిని వెతకడం కాదని, ముందుగా విశాఖ భూ కుంభకోణానికి సంబంధించిన సిట్ నివేదికను పూర్తి స్థాయిలో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక బయటపెడితే ప్రభుత్వం కూలిపోతుందని, అందుకే, దీన్ని చంద్రబాబు దాచిపెడుతున్నారని విమర్శించారు. ఈ నివేదికను బయటపెట్టిన తర్వాతే తనపై అభ్యర్థిని పోటీకి దించాలని టీడీపీని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
YSRCP
ganta
avanti

More Telugu News