కరాచీ బేకరికి వ్యతిరేకంగా నిరసనలు.. తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు!
- పుల్వామా ఉగ్రదాడితో ఆందోళనలు ఉద్ధృతం
- బెంగళూరులో కరాచీ బేకరి ఎదుట మూకల ఆందోళన
- ఈ మూర్ఖపు చర్యలను ముక్తకంఠంతో ఖండించాలన్న ఐవైఆర్
తాజాగా ఈ ఆందోళనకారుల చర్యను బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఖండించారు. ఈరోజు ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ..‘రండి.ఈ మూర్ఖపు చర్యలను ముక్తకంఠంతో ఖండిద్దాం. భారత ఉపఖండపు సంస్కృతి రాజకీయ సరిహద్దుల కంటే విస్తృతమైనది. రాజకీయంగా విభజింపబడినా ఈ ఉపఖండం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఒక్కటే. ఈ పనికిమాలిన చర్యలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు.