పశ్చిమ గోదావరిలో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరి దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు!
- పెదవేగి మండలం వేగివాడ దగ్గర ఘటన
- కారు నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే మృతి
- గాయపడ్డ వృద్ధురాలు ఆసుపత్రికి తరలింపు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో కారును నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మృతుడి స్వస్థలం దెందులూరు మండలం శ్రీరామవరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.