తమిళనాట ప్రేమోన్మాది కత్తికి బలైన మరో యువతి.. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో హత్య!

  • నిందితుడు బాధితురాలి క్లాస్‌మేట్
  • ఇంటికెళ్లి పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్
  • నిరాకరించిందన్న కోపంతో పగ
‘ప్రేమ కత్తి’కి మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. పెళ్లికి నిరాకరించిందన్న కసితో ఓ టీచర్‌ను తరగతి గదిలో అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడో ప్రేమోన్మాది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. కురింజిపాడికి చెందిన రమ్య డిగ్రీ పూర్తి చేసి స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం రమ్య ఇంటికి వెళ్లిన ఆమె ఒకప్పటి క్లాస్‌మేట్ రాజశేఖర్.. రమ్యను పెళ్లాడతానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి వారు నిరాకరించారు.

పెళ్లికి నిరాకరించడంతో అవమాన భారంతో రగిలిపోయిన రాజశేఖర్ ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం ఆమె పనిచేస్తున్న స్కూలుకు వెళ్లాడు. ఆమె క్లాసులో ఉందని తెలిసి నేరుగా అక్కడికే వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి చంపాడు. ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

స్కూలు యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు. కాగా, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాజశేఖర్ తన సోదరికి మెసేజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Tamil Nadu
kadaluru
Love
Murder
Teacher
Class room

More Telugu News