తెలంగాణ బడ్జెట్ పై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
- అన్నిరంగాలకు సమతుల్యతతో కేటాయింపులు
- రైతుబంధు, రుణమాఫీ అమలుకు వీలు
- ట్విట్టర్ లో స్పందించిన మాజీ మంత్రి
ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.