100 కోట్లకు చేరువలో 'గల్లీబాయ్'

  • ఈ నెల 14న వచ్చిన 'గల్లీబాయ్'
  • ముంబైకి చెందిన ఓ మురికివాడ కుర్రాడి కథ
  •  తొలివారంలో 89.15 కోట్ల వసూళ్లు         
రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా జోయా అక్తర్ దర్శకత్వంలో 'గల్లీబాయ్' నిర్మితమైంది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా 89.15 కోట్లను వసూలు చేసింది.

ఓవర్సీస్ మార్కెట్ లోను వసూళ్ల పరంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువలన రెండవ వారంలో ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం ఖాయమని చెబుతున్నారు. ముంబైకి చెందిన ఒక మురికివాడ కుర్రాడి కథ ఇది. ఈ పాత్రలో రణ్ వీర్ సింగ్ అద్భుతంగా ఒదిగిపోయాడని అంటున్నారు. ఆయన నటనలో మరింత పరిణతి కనిపించిందని ప్రశంసిస్తున్నారు. ఆయన కెరియర్లో ఇది ఒక చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
ranveer singh
alia bhatt

More Telugu News