నెల్లూరుకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఘనంగా స్వాగతం పలికిన సోమిరెడ్డి, నారాయణ!
- వెంకయ్యనాయుడు ఇంటికెళ్లిన రాష్ట్రపతి
- అనంతరం అక్షర విద్యాలయం సందర్శన
- స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవాల్లో పాల్గొననున్న కోవింద్
ఈ పర్యటనలో భాగంగా కోవింద్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెంకటాచలం అక్షర విద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రాష్ట్రపతి నెల్లూరు పర్యటన నేపథ్యంలో అధికారులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.