చింతమనేని వ్యాఖ్యలతో కలత చెంది ఆ వీడియోను షేర్ చేశాను: నిందితుడు కత్తుల రవి
- నేను విద్యావంతుడిని
- ఆ వీడియోను మార్ఫింగ్, ఎడిటింగ్ చేయలేదు
- అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు.. చింతమనేనినే
చింతమనేని వీడియోను ఎడిట్ చేసిన వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన కత్తుల రవికి గురువారం బెయిలు మంజూరైంది. ఈ కేసుపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీని నిడివి 30 సెకన్లు అని పేర్కొన్నారు. ఇతురుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఈ వీడియోను సృష్టించిన రవిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. రవి తొలుత ఆ వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టి ఆ తర్వాత యూట్యూబ్లో పెట్టాడని ఎస్పీ వివరించారు.