పాక్ కు భారత్ 'జల'క్: మూడు నదుల నీళ్లు పాక్ కు మళ్లకుండా ‘కేంద్రం’ నిర్ణయం!

21-02-2019 Thu 20:36 | National
  • రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్లు పాక్ కు వెళ్లనీయం
  • మన ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ నీళ్లన్నీ ‘యమున’కు  
  • మన వాటా సింధూ నదీ జలాలను పాక్ కు వెళ్లనీయం
పుల్వామాలో ‘ఉగ్ర’ దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటోంది. పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్టు ఐదు రోజుల క్రితం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. తాజాగా, రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్థాన్ కు మళ్లకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

కాగా, లక్నోలో ఈరోజు ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, దేశ విభజన అనంతరం ఇరు దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, రావి, బియాస్, సట్లెజ్  నదులపై భారత్ కు, సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్ కు పూర్తి హక్కులు లభించాయని అన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కనుక పాక్ లోని నదుల్లోకి నీరు ప్రవహించదని, మన ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఈ నీళ్లన్నీ యమునా నదికి మళ్లిస్తామని అన్నారు. తద్వారా, మనకు మరిన్ని జలాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సింధు నదీ జలాల విషయంలో మన దేశానికి రావాల్సిన వాటా జలాలను పాకిస్థాన్ కు వెళ్లనీయకుండా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్ లో గడ్కరీ పేర్కొన్నారు. ఆ నీటిని తూర్పు నదుల్లోకి మళ్లిస్తామని, జమ్మూ కశ్మీర్, పంజాబ్ లోని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. రావి నదిపై షాపుర్ కాందీ డ్యామ్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. యూజేహెచ్ ప్రాజెక్టు ప్రాంతంలో మన వాటా నీళ్లను నిల్వ చేసి జమ్ముకశ్మీర్ కు అందిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా ఆయా పరీవాహక ప్రాంతాలకు అందిస్తామని, ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Under the leadership of Hon'ble PM Sri @narendramodi ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert  water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.

— Nitin Gadkari (@nitin_gadkari) February 21, 2019
IndiaPakistannitin gadkari

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more