హరీశ్ రావు తప్పు చేశారు.. అందుకే నా ఆరోపణలపై స్పందించడం లేదు!: జగ్గారెడ్డి
- కేసీఆర్ వల్ల సంగారెడ్డికి మేలు జరుగుతుంది
- హరీశ్ నిర్వాకంతో మంజీర-సింగూరు ఎండిపోయింది
- హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత మీడియా సమావేశం
తాను తెలంగాణ సీఎం కేసీఆర్ ను నేరుగా కలవబోననీ, అన్ని విషయాలను మీడియా ద్వారానే చెప్పదలుచుకున్నానని జగ్గారెడ్డి అన్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం కేసీఆర్ ఇష్టమేనని వ్యాఖ్యానించారు. మంజీర-సింగూరు విషయంలో చేసిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ నిర్వాకంతో సంగారెడ్డిలో భూగర్భ జలాలు తగ్గిపోయాయనీ, బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. హరీశ్ రావు తప్పు చేశారు కాబట్టే తన ఆరోపణలపై స్పందించడం లేదని స్పష్టం చేశారు. అందుకే టీఆర్ఎస్ సైతం ఈ విషయంలో మౌనం పాటిస్తోందన్నారు.