బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం.. 56 మంది సజీవ దహనం
- రసాయన గోదాంలో చెలరేగిన మంటలు
- రాత్రి నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు
- పదుల సంఖ్యలో క్షతగాత్రులు
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుంచి మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు చౌక్ బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉందని, మంటల ధాటికి పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.