మృత్యువును జయించిన మధులిక... నేడు డిశ్చార్జ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మృత్యువును జయించిన మధులిక... నేడు డిశ్చార్జ్!

  • ఈ నెల 6న మధులికపై భరత్ దాడి
  • వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం
  • ఆపై మరో వారం చికిత్స
తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన భరత్ అనే యువకుడు కొబ్బరిబొండాలను కొట్టే కత్తి తీసుకుని విచక్షణారహితంగా నరకడంతో తీవ్ర గాయాలపాలై, దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి, ఆపై మరో వారం రోజులు చికిత్స పొంది కోలుకున్న మధులిక నేడు డిశ్చార్జ్ కానుంది. ఆమెను ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేయనున్నామని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని, లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు వెల్లడించారు.

తొలుత బతకడమే కష్టమని భావించిన తన కుమార్తె ప్రాణాలను కాపాడిన వైద్యులు దేవుళ్లని మధులిక తండ్రి వ్యాఖ్యానించాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని దేవుడిని ప్రార్థించిన వందలాది మందికి కృతజ్ఞతలని అన్నాడు. కాగా, ఈ నెల 6న మధులికపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Madhulika
Bharat
Discharg

More Telugu News