వాహనం ఢీకొని ఫ్లయ్ ఓవర్ పై నుంచి ఎగిరిపడ్డ యువతి... వీడియో!
- న్యూఢిల్లీ వికాస్ పురిలో ఘటన
- బైక్ పై వెళుతుంటే ఢీకొన్న మరో బైక్
- స్వల్పగాయాలతో బయటపడ్డ యువతి
తన మిత్రుడిని కలిసే నిమిత్తం మోటార్ సైకిల్ పై పశ్చిమ విహార్ నుంచి జనక్ పురికి ఇద్దరు స్నేహితులతో కలిసి సప్న వెళుతున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. కునాల్ అనే మిత్రుడు వాహనం నడుపుతూ ఉండగా, మధ్యలో జియో, వెనుక సప్న ఉన్నారు. వికాస్ పురి ఫ్లయ్ ఓవర్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిల్ వారిని ఢీకొంటూ వేగంగా వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో కునాల్, జియో ఫ్లయ్ ఓవర్ బారియర్ ను గుద్దుకోగా, సప్న గాలిలోకి ఎగిరి కిందనున్న రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనమూ రాలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను, ఆమె మిత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.