రాహుల్, అఖిలేష్ భారత ఇంజినీర్లను అవమానించారు.. ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి: మోదీ
- నైతిక స్థైర్యం కోల్పోవద్దు
- సెమీ హైస్పీడు లక్ష్యంగా విమర్శలు
- ఇంజినీర్ల శ్రమను దేశం గౌరవిస్తోంది
ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోవద్దని ప్రజలకు సూచించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు లక్ష్యంగా విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టులో భారత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు భాగమని, ఈ రైలును విమర్శించడమంటే.. వారిని అవమానించడమేనని అన్నారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని.. వారు దేశానికి గర్వకారణమని అన్నారు.