ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురు కార్యకర్తలకు గాయాలు!

ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నాయకుడు పాలేటి రామారావు వర్గీయులు ఘర్షణకు దిగారు. కొణిజేటి చేనేతపురిలో ప్రజా సమస్యలపై పాలేటి రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలేటి వర్గీయులతో పాటు ఆమంచి వర్గీయులు కూడా హాజరయ్యారు. ఈ సభకు ఎందుకొచ్చారంటూ వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. గాయపడ్డ వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
Prakasam District
konijeti chenetapuri
aamanchi
paleti reama rao
YSRCP
Telugudesam
chirala

More Telugu News