Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీనియర్ ఆర్టిస్టులపట్ల అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదనే చెప్పాలి: వై.విజయ

  • పాత తరం వాళ్లతో పనిచేశాను 
  • సీనియర్స్ ను గౌరవించడం తెలుసుకున్నాను
  • ఇప్పుడు అంతా ఈజీగానే తీసుకుంటున్నారు  
కేరక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన వై.విజయ, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పటికీ .. ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పును గురించి ప్రస్తావించారు. "నేను పాత తరం ఆర్టిస్టులను చాలా దగ్గరగా చూశాను. ఎన్టీఆర్ .. సావిత్రి .. అక్కినేని సినిమాల్లో చేశాను. అయితే అప్పుడు నాది చాలా చిన్న వయసు కావడం వలన, వాళ్లంతా మహానటులు అనే విషయం తెలియదు.

అలాంటివాళ్లతో కలిసి నటించడం వలన వృత్తిపట్ల ఎంతటి అంకితభావం ఉండాలనేది అర్థమైంది. పెద్దలను ఎలా గౌరవించాలనే విషయం తెలిసింది. చెప్పిన సమయానికి ముందుగానే లొకేషన్ లో ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాను. భయభక్తులతో మా పనిని మేం చేసే వాళ్లం. ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. ఎవరూ ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. సీనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవం లేదు .. సెట్లో క్రమశిక్షణ కనిపించడం లేదు" అని చెప్పుకొచ్చారు.
y.vijaya

More Telugu News