'అబ్బాయిగారు'లో నెగెటివ్ షేడ్స్ వున్న ఆ పాత్ర చేయకూడదనుకున్నాను: సీనియర్ నటి జయచిత్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అబ్బాయిగారు'లో నెగెటివ్ షేడ్స్ వున్న ఆ పాత్ర చేయకూడదనుకున్నాను: సీనియర్ నటి జయచిత్ర

  • 'అబ్బాయిగారు'లో సవతి తల్లిగా చేయడానికి ఆలోచించాను
  • రామానాయుడు గారు చేయవలసిందే అన్నారు
  •  నిజంగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది    
వెంకటేశ్ కథానాయకుడిగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అబ్బాయిగారు' సినిమాలో జయచిత్ర కీలకమైన పాత్రను పోషించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆ సినిమాను గురించి జయచిత్ర ప్రస్తావించారు. "ఒక రోజున నిర్మాత నరసింహారావుగారు నాకు ఫోన్ చేసి 'అబ్బాయిగారు' సినిమాలో సవతి తల్లి పాత్రను గురించి చెప్పి .. చేయమని అడిగారు. యాంటీ రోల్ కి నేను పనికొస్తానా అనే ఆలోచనలో పడ్డాను.

రెండు రోజుల తరువాత ఆయన రామానాయుడు గారితో ఫోన్ చేయించారు. 'జయా .. 'అబ్బాయిగారు'లో ఆ రోల్ నువ్వే చేయాలి' అన్నారు. మురళీమోహన్ గారు కూడా ఫోన్ చేసి .. 'ఆ రోల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది' అని చెప్పారు. దాంతో ఓకే అని చెప్పేసి చేశాను .. నిజంగానే ఆ పాత్ర నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను టీవీలో చూసిన జమునగారు చాలా బాగా చేశావంటూ ప్రశంసించారు. 'ఆ పాత్రకి నేను కూడా సరిపోను .. అద్భుతంగా చేశావు' అని వాణిశ్రీ గారు ఫోన్ చేసి చెప్పారు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
jayachithra

More Telugu News