లోటస్ పాండ్ లో జగన్ తో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి చర్చలు!
- జగన్ ఇంటికి వచ్చిన కిల్లి దంపతులు
- హోదా వైసీపీతోనే సాధ్యమన్న కిల్లి
- కాంగ్రెస్ కు రాజీనామా చేశానని వెల్లడి
ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, లోటస్ పాండ్ లోని తన నివాసానికి వచ్చిన కిల్లి దంపతులను ఆహ్వానించిన జగన్, వారితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని అన్నారు. ఈ నెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా అది వైఎస్ జగన్ తోనే సాధ్యమని నమ్మే పార్టీలో చేరుతున్నానని, జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని అన్నారు.