లిఫ్ట్ ఇస్తామంటూ తోటి ఉద్యోగినిని కారులో ఎక్కించుకుని... మత్తిచ్చి అత్యాచారం!
- న్యూఢిల్లీలో ఘటన
- ఎంఎన్సీలో పనిచేస్తున్న యువతి
- లిఫ్ట్ ఇస్తామంటూ తీసుకెళ్లి అఘాయిత్యం
వారితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కూల్ డ్రింక్ ను ఇచ్చారు. దాన్ని తీసుకున్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని తనపై అత్యాచారం చేశారని, ఆఖరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో తనను వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించింది. ఆపై తాను ద్వారక ప్రాంతంలోని ఇంటికి చేరుకుని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చానని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.