చంద్రబాబును కలిసిన వైసీపీ నేత యడం బాలాజీ.. టీడీపీలో చేరికకు సిద్ధం
- వైసీపీని వీడనున్న చీరాల నేత
- పార్టీలోకి ఆమంచి రాకపై వ్యతిరేకం
- నేడో, రేపో టీడీపీలో చేరిక
బాలాజీ ఆదివారం అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబును కలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేరికకు చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.