బ్రేకింగ్... కీలక ఉగ్రవాది, అదిల్ కు శిక్షణ ఇచ్చిన ఘాజీ రషీద్ ను మట్టుబెట్టిన భారత సైన్యం!
- ఆత్మాహుతి దాడి ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎన్ కౌంటర్
- ఘాజీ రషీద్ హతం, పట్టుబడిన మరో ఉగ్రవాది
- అమరులైన నలుగురు సైనికులు
ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఎన్ కౌంటర్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు, ఘాజీ రషీద్ ను హతమార్చాయి. మరణించింది రషీదేనని ఓ సైనికాధికారి స్పష్టం చేశారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.