అప్పట్లో నేను ప్రేమించిన వాడిని నా స్నేహితురాలు ఎగరేసుకుపోయింది!: హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో నేను ప్రేమించిన వాడిని నా స్నేహితురాలు ఎగరేసుకుపోయింది!: హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్

  • కోలీవుడ్ లో చేతినిండా సినిమాలతో ఐశ్వర్య
  • ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే తొలి ప్రేమ
  • కొన్నేళ్ల తరువాత ప్రియుడితో విడిపోవాల్సివచ్చిందన్న ఐశ్వర్య
పుట్టింది, పెరిగింది అచ్చ తెలుగు అమ్మాయిగానే అయినా, టాలీవుడ్ కన్నా, కోలీవుడ్ లో ఎక్కువగా రాణించి, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, ప్రేమ విషయంలో మాత్రం తాను దురదృష్టవంతురాలిని అంటోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఐశ్వర్య, తాను ప్రస్తుతానికి ఒంటరినేనని చెప్పింది.

ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డానని, అయితే, అది మూన్నాళ్లముచ్చటే అయిపోయిందని చెప్పింది. తాను లవ్ చేసిన యువకుడిని తన స్నేహితురాలే ఎగరేసుకుపోయిందని చెప్పింది. ఆపై కొన్నేళ్ల తరువాత మళ్లీ ప్రేమలో పడ్డానని, అప్పుడు కూడా తాము విడిపోవలసిన పరిస్థితి వచ్చిందని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

 ఎవరినైనా ప్రేమిస్తే అది ఎల్లకాలం సాగాలని భావిస్తానని, కొందరు మాత్రం ప్రేమించుకుని, బ్రేకప్‌ అయి మరొకరిని ప్రేమిస్తుంటారని, అది ఎలా సాధ్యమో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని తెలిపింది. ఒక సినిమా నటి ప్రేమలో పడటం అంత సులభమేమీ కాదని చెప్పింది.
Kollywood
Aishwarya Rajesh
Love

More Telugu News