జగన్ మాటల్లో ఏమన్నా అర్థం ఉందా? రెండేళ్ల క్రితమే దానిని మూసేశాం: కేశినేని నాని
- జగన్ మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు
- కేశినేని ట్రావెల్స్‌ను మూసేసి రెండేళ్లు అయింది
- జగన్ అవగాహన రాహిత్యానికి పరాకాష్ట
బీసీ గర్జన సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు నాని చెప్పారు. ప్రతిపక్షనేత ఇప్పుడు ఇస్తున్న హామీలను తాము ఇప్పటికే అమలు చేసి చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గొల్లపూడిలో నిర్వహించిన టీడీపీ నేతల బీసీ సోదరుల ఆత్మీయ సదస్సులో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.