వైసీపీకి ఒక్కసారి అవకాశమివ్వండి.. గెలిపించండి: వైఎస్ జగన్
- బీసీలను కరివేపాకులా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
- ఇటువంటి వ్యక్తిని 2019 ఎన్నికల్లో ఓడించాలి
- మా పార్టీని గెలిపిస్తే మంచి పనులు చేస్తాం
బీసీలను కరివేపాకులా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఇటువంటి వ్యక్తిని 2019 ఎన్నికల్లో ఓడించి, తమ పార్టీని గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మంచి పనులు చేస్తామని, ఆ మంచి పనుల గురించి చెప్పి 2024 ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని ఓట్లు వేయమని అడుగుతామని అన్నారు. నవరత్నాలు అమల్లోకి రావాలంటే అందరి చల్లని దీవెనలు తనకు కావాలని జగన్ కోరారు.