తెలుగుదేశం పార్టీ ఓ డ్రామా కంపెనీ : కన్నా లక్ష్మీనారాయణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగుదేశం పార్టీ ఓ డ్రామా కంపెనీ : కన్నా లక్ష్మీనారాయణ

  • అక్కడలా పూటకో వేషం మా వల్ల సాధ్యం కాదు
  • తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు...ఏపీలో లేదట
  • చంద్రబాబు తీరు అదేనన్న కన్నా  
తెలుగుదేశం పార్టీలా పూటకో వేషం, గంటకో మాట తమ వల్ల సాధ్యం కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 'అదో డ్రామా కంపెనీలాంటి పార్టీ, దాని అధినేత చంద్రబాబు రోజుకో వేషం వేస్తారు' అని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబునాయుడు ఏపీకి వచ్చేసరికి లేదంటున్నారంటే వారి తీరు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానాలు చేశారని, తాజాగా ఆ తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని చెప్పారు. చంద్రబాబుకు చేతనైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీలో అధికారం సాధించడమే లక్ష్యంగా ఒంటరిగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 21న రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్‌ షా సమావేశమవుతారని చెప్పారు.
BJP
kanna
Chandrababu

More Telugu News