హోటల్ బిల్లు చూసి రకుల్ కి కళ్లు తిరిగాయట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోటల్ బిల్లు చూసి రకుల్ కి కళ్లు తిరిగాయట!

  • లండన్ లో స్టార్ హోటల్ కి వెళ్లిన రకుల్
  •  స్నేహితులతో కలిసి విందు
  •  పది మందికి పది లక్షల బిల్లు
స్నేహితులను తీసుకుని సరదాగా ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు, అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లు అయినప్పుడు ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ రకుల్ కి కూడా అదే పరిస్థితి ఎదురైందట .. అదీ లండన్ లో. ఇటీవల లండన్ వెళ్లిన రకుల్ ..  ఓ పదిమంది స్నేహితులకు పార్టీ ఇవ్వడం కోసం స్టార్ హోటల్ కి వెళ్లిందట.

స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అంతా హ్యాపీగా విందు ఆరగించారు. అయితే, అందుకు ఆ హోటల్ వారు వేసిన బిల్లు అక్షరాలా 10 లక్షలు. అంతే.. రకుల్ కి కళ్లు తిరిగినంత పనైందట. స్టార్ హోటల్స్ లో రేట్లు రకుల్ కి తెలియనివి కావు. కానీ ఈ స్థాయి రేట్లు మాత్రం తాను ఎక్కడా చూడలేదనీ, పది మంది కలిసి విందు చేస్తే పది లక్షల బిల్లు కావడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇకపై ఆ వైపుకు వెళ్లను కూడా వెళ్లనని ఒట్టు పెట్టుకుందట! 
rakul

More Telugu News