టార్గెట్ వైసీపీ- టీడీపీ.. ‘అమ్మ దొంగ’ అంటూ ఫన్నీ వీడియోను రిలీజ్ చేసిన నాగబాబు!

  • మై ఛానల్-నా ఇష్టంలో పోస్ట్ చేసిన మెగాబ్రదర్
  • వైసీపీ-టీడీపీకి సంబంధం లేదని వ్యాఖ్య
  • చైనాలోని యువాంగ్ చంగ్ రాష్ట్రంలో ఇది జరిగిందన్న నాగబాబు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు, నేతల వ్యవహారశైలిపై మెగా బ్రదర్ ఇటీవలి కాలంలో నాగబాబు సునిశితంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష పార్టీలు లక్ష్యంగా ఆయన ఇప్పటికే పలు వీడియోలను విడుదల చేశారు. తాజాగా ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఓ ఫన్నీ వీడియోను నాగబాబు తన ఛానల్ ‘మై ఛానల్ నా ఇష్టం’లో పోస్ట్ చేశారు. ఈ ఘటన చైనాలోని యువాంగ్ చంగ్ రాష్ట్రంలో జరిగిందనీ, దీనికి ఏపీలోని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఫన్నీ, సెటైరికల్ వీడియోను మీరూ చూసేయండి.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
YSRCP
nagababu
criticise
funny video

More Telugu News