మెగా డాటర్ కోసం కథను సిద్ధం చేసిన సుకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా డాటర్ కోసం కథను సిద్ధం చేసిన సుకుమార్

  • దర్శకుడిగా వరుస విజయాలు
  • నిర్మాతగాను బిజీ 
  • దర్శకులుగా శిష్యులకి అవకాశం  
ఒక వైపున దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న సుకుమార్, మరో వైపున నిర్మాతగాను బిజీ అవుతున్నాడు. తనే కథలను అందిస్తూ .. దర్శకులుగా తన శిష్యులను పరిచయం చేస్తున్నాడు. కొంచెం పెద్ద ప్రాజెక్టు అనుకుంటే, ఇతర నిర్మాతలను భాగస్వాములుగా చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పనుల్లోనే సుకుమార్ తీరిక లేకుండా వున్నాడు.

రీసెంట్ గా ఆయన మెగాస్టార్ కి మరో మేనల్లుడైన వైష్ణవ్ తేజ్ ను తెలుగు తెరకి పరిచయం చేసే పనిపెట్టుకున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా నాగబాబు కూతురు నిహారిక కోసం కూడా సుకుమార్ ఒక మంచికథను సిద్ధం చేశాడట. గీతా ఆర్ట్స్ తో గానీ .. అంజనా ప్రొడక్షన్స్ తో గాని కలిసి సుకుమార్ నిర్మించనున్న ఈ సినిమాకి, ఆయన మరో శిష్యుడు దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. త్వరలోనే పూర్తి  వివరాలు తెలియనున్నాయి.
sukumar
niharika

More Telugu News