ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనపోరాటం!

  • మోసం చేశాడంటూ 2017లోనే ప్రియుడిపై కేసు
  • ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఇంటి వద్ద ఆందోళన
  • సికింద్రాబాద్‌లోని మారేడుపల్లిలో ఘటన
ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడంటూ అతడి ఇంటి వద్ద ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా మరిగెడి గ్రామానికి చెందిన అనూష (19), అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ఉద్యోగాల నిమిత్తం 2016లో హైదరాబాద్ వచ్చిన వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో 2017లో అనూష చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ప్రశాంత్‌పై కేసు పెట్టింది.  ప్రశాంత్ తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే,  అప్పటికి ఆమె మైనర్ కావడంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు.

తాజాగా, ప్రశాంత్‌కు వివాహమైందని తెలుసుకున్న అనూష మారేడుపల్లిలో ఉంటున్న ప్రియుడు ప్రశాంత్ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. విషయం తెలిసిన పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు.

Secunderabad
Telangana
Love
Maredpally
Janagoan

More Telugu News