నటుడిగా నేటితో 50 యేళ్లు పూర్తి చేసుకున్న అమితాబ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడిగా నేటితో 50 యేళ్లు పూర్తి చేసుకున్న అమితాబ్

  • నటుడిగా సుదీర్ఘమైన ప్రయాణం
  • ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు
  • ఇప్పటికీ శ్రమను ఇష్టపడే స్వభావం
బాలీవుడ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేటివరకూ నటుడిగా అమితాబ్ ప్రయాణం కొనసాగుతూనే వుంది. కెరియర్లో ఎన్నో అవాంతరాలను నవ్వుతూనే అధిగమించిన ఆయన, ఈ రోజున బాలీవుడ్ కి పెద్ద బాలశిక్షగా నిలిచారు. తరాలు మారుతున్నా .. కొత్త హీరోలు వస్తున్నా ఆయన స్థానం సుస్థిరంగా ఉంటూ వచ్చింది. అలాంటి అమితాబ్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు.

నటుడిగా సుదీర్ఘమైన ఆయన ప్రయాణంలో జాతిరత్నాల్లాంటి సినిమాలు .. ఆణిముత్యాల్లాంటి చిత్రాలు మైలురాళ్లుగా కనిపిస్తాయి. నటుడిగా ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సన్నిహితులంతా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ .. "50 యేళ్ల క్రితం ఇదే రోజున ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ రోజుకీ ఆయనకి తన పని పట్ల నిబద్ధత ఎంత మాత్రం తగ్గలేదు. విషెస్ చెబుదామని నేను అయన రూమ్ కి వెళితే తయారవుతున్నారు .. 'ఎక్కడికి నాన్న?' అంటే 'పనికి' అంటూ సమాధానం ఇచ్చారు. అందుకే ఆయన నా మార్గదర్శకుడు .. విమర్శకుడు' అని ట్వీట్ చేశాడు. 
amithabh
abhishek

More Telugu News