ఏపీ డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు!
- రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం
- మొత్తం 7,092 పోస్టుల భర్తీకి పరీక్ష
- మే 15న నియామక పత్రాల జారీ
జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. తొలిసారిగా మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మే నెల 15వ తేదీన నియామక పత్రాలు అందజేస్తామనీ, వారికి 10 రోజుల పాటు శిక్షణ అందజేస్తామని మంత్రి గంటా అన్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను http://apdsc.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.