అమెరికాను వణికిస్తున్న భయంకరమైన కొత్త వ్యాధి 'జొంబీ డీర్'
- జింకలు, దుప్పులలో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధి
- మనుషులకు కూడా సోకే ప్రమాదం
- ఇప్పటి వరకు అందుబాటులో లేని వ్యాక్సిన్
ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ సోకగానే దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తం వైరస్ విస్తరించిన తర్వాత కానీ వ్యాధి సోకినట్టు మనకు అర్థం కాదు. ఇదే ఇప్పుడు అంత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. అమెరికాలోని 24 రాష్ట్రాలతో పాటు... రెండు కెనెడియన్ ప్రావిన్స్ లలో కూడా ఈ వ్యాధి వ్యాపించినట్టు అధికారులు తెలిపారు.
ఈ వైరస్ సోకగానే నోటి నుంచి చొంగ కారడం, దప్పిక వేయడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.