సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళ రీమేక్ లో రకుల్ ప్రీత్ 
  • నిర్మాతగా దూకుడు పెంచుతున్న నాని 
  • పూర్తి స్థాయి ఎంటర్ టైనర్లో మహేశ్
*  తమిళంలో హిట్టయిన 'రాచ్చసన్' చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'వీర' ఫేం రమేశ్ వర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించే ఛాన్స్ వుంది. ఈ చిత్రం కోసం ఆమెకు భారీ మొత్తంలో ఆఫర్ చేశారట.  
*  అటు హీరోగా కొనసాగుతూనే ఇటు నిర్మాతగా కూడా తన అభిరుచి మేర చిత్రాలు నిర్మించడానికి హీరో నాని సిద్ధమవుతున్నాడు. ఆమధ్య 'ఆ..' చిత్రాన్ని నిర్మించిన నాని ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట.
*  'దూకుడు', 'ఆగడు' చిత్రాల తర్వాత మహేశ్ బాబు మళ్లీ పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ చేయడానికి ఓకే చెప్పాడు. 'ఎఫ్ 2' చిత్రం ద్వారా భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. దిల్ రాజు, అనిల్ సుంకర కలసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తారు.
Rakul
Nani
Mahesh
Anil

More Telugu News