సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆ సినిమాతో రకుల్ కోరిక తీరిందట
  • అదే రోజున 'జెర్సీ' తమిళ వెర్షన్ కూడా 
  • తెలుగులో కూడా రానున్న 'భరత్' 
*  'దేవ్' సినిమాతో తన చిరకాల కోరిక తీరిందని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'ఎప్పటి నుంచో పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంలో నటించాలని ఆశపడ్డాను. అది దేవ్ చిత్రంతో తీరింది. నేను చేసిన చిత్రాలన్నిటిలోకి ఇది భిన్నం' అని చెప్పింది. కాగా, ఈ చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
*  నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న 'జెర్సీ' చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, అదే రోజున ఈ చిత్రం తమిళ వెర్షన్ ను కూడా రిలీజ్ చేస్తారట. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది.
*  సల్మాన్ ఖాన్ కి తెలుగులో కూడా అభిమానులు వున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'భరత్' హిందీ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
Rakul
Nani
Shraddha
Salman

More Telugu News