కృష్ణగారి అంచనా ఎప్పుడూ తప్పలేదు: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణగారి అంచనా ఎప్పుడూ తప్పలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • కృష్ణగారు ఎంతో కష్టపడ్డారు 
  • కథ .. మాటలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ
  • ఆయన హిట్ అంటే హిట్టే  
కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు పరుచూరి బ్రదర్స్ కథ .. సంభాషణలు అందించారు. అలా వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. కృష్ణతో సుదీర్ఘమైన ప్రయాణం చేసిన నేపథ్యంలో, ఆయన గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

" కృష్ణగారు సూపర్ స్టార్ అయిన తరువాత కూడా మూడు షిప్ట్ లలో పనిచేసేవారు. కథ విషయంలో .. డైలాగ్స్ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. కథ వినగానే ఆ సినిమా హిట్ అవుతుందా .. లేదా అనేది చెప్పేస్తారు. 'ఈనాడు' కథ చెప్పినప్పుడు .. తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చి చెప్పమన్నారు. అలా చెప్పగానే .. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు. అన్నట్టుగానే ఆ సినిమా 200 రోజులు ఆడింది. ఇక 'ఉద్దండుడు' .. 'తెలుగు వీర లేవరా' సినిమాలు పోతాయని ఆయన ముందుగానే చెప్పారు. అన్నట్టుగానే ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. నాకు తెలిసి కృష్ణగారి జడ్జిమెంట్  ఎప్పుడూ తప్పలేదు" అని చెప్పుకొచ్చారు. 
paruchuri

More Telugu News