నేను లోయలోపడి చనిపోయాననుకున్నారు: సీనియర్ నటి విజయలలిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను లోయలోపడి చనిపోయాననుకున్నారు: సీనియర్ నటి విజయలలిత

  • తెలుగులో 'రౌడీరాణి' 
  • హిందీలో 'రాణి మేరా నామ్'
  • మా అమ్మ స్పృహతప్పి పడిపోయింది 
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో విజయలలిత మాట్లాడుతూ .. షూటింగులో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "తెలుగులో నేను చేసిన 'రౌడీ రాణి' సినిమాను హిందీలో 'రాణి మేరా నామ్' పేరుతో తీస్తున్నారు. ఓ రోజున నేను గుర్రంపై స్వారీ చేసే సీన్ ను షూట్ చేస్తున్నారు. నేను గుర్రంపై స్వారీ మొదలు పెట్టాను .. కానీ అది నా మాట వినడం లేదు. ఒక వైపున పెద్ద లోయ వుంది .. దానికి చిన్నపిట్టగోడ మాత్రమే అడ్డుగా వుంది.

ఆ వైపు గుర్రం వెళితే అందులో పడిపోవడం ఖాయమని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. అయితే అనుకోకుండా ఒక వ్యాన్ అడ్డుగా రావడం వలన గుర్రం ఆగిపోయింది. అయితే నేను ఆ లోయలో పడి చనిపోయాననే వార్త బయటికి వెళ్లిపోయింది. ఈ వార్త తెలిసి ఇంటి దగ్గరున్న మా అమ్మ స్పృహ తప్పి పడిపోయిందట. నేను షూటింగ్ పూర్తి చేసుకుని .. హోటల్ కి వచ్చి అమ్మా వాళ్లకి ట్రంకాల్ బుక్ చేసి 'హలో' అన్నాను. నేను బతికే వున్నానని తెలిసి అప్పుడు మా అమ్మ పడిన ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.
vijaya lalita
ali

More Telugu News